News

ఉనికిలోకి వచ్చిన లడఖ్ పోలీసులు – కొత్త చిహ్నాన్ని ఆమోదించిన లెఫ్టినెంట్ గవర్నర్

545views

డఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన చారిత్రాత్మక పరిణామం తర్వాత, ఇప్పుడు ప్రత్యేక లడఖ్ పోలీసులు ఉనికిలోకి వచ్చారు.  ఇప్పుడు లే మరియు కార్గిల్ జిల్లాల్లోని పోలీసులను లడఖ్ పోలీసులని పిలుస్తారు. లడఖ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ ఖండారే తమ ప్రాధాన్యతల గురించి AIR న్యూస్ తో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ నుండి విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడిన లడఖ్ పోలీసులకు కొత్త చిహ్నాలు, గుర్తు మరియు ప్రత్యేక గుర్తింపుతో జెండా ఉంటుంది.

లడఖ్ పోలీసుల కొత్త చిహ్నాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కె మాథుర్ ఆమోదించారు. ఈ మార్పులు ఒక నెల వ్యవధిలో అమలులోకి వస్తాయని ఎస్ఎస్ ఖండారే తెలిపారు. చిహ్నం మరియు లోగోలో లడఖ్ గొప్పతనం ప్రతిబింబించేలా లడఖ్ పోలీసులు మరియు యుటి అడ్మినిస్ట్రేషన్ దృష్టి పెట్టారు.  త్యాగాన్ని ప్రతిఫలించేలా రక్త సింధూర వర్ణం నేపథ్యంతో బంగారు రంగు బోర్డర్ మరియు రిబ్బన్‌ తో కదులుతున్న మంచు చిరుత చిత్రం లడాఖ్ పోలీసుల చిహ్నంగా రూపొందించబడింది.

లోగోలో “సత్యమేవ జయతే” సూక్తి తోపాటు అశోక స్థూపం కనిపిస్తుంది. రూపకల్పనలో LP మరియు అశోక కలుపుతున్న జునిపెర్ ఆకులు (మతపరమైన సందర్భాల్లో ఇచ్చే ధూపం) ఉన్నాయి.  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల  పోలీసు బలగాల లాగే లడాఖ్ పోలీసు విభాగం కూడా పనిచేస్తుంది.  ‘ఖిద్మత్ ఔర్ హిమ్మత్’ అనే నినాదంతో ఎరుపు మరియు నీలం రంగు లడఖ్ పోలీసు జెండా సేవను మరియు ధైర్యాన్నీ ప్రేరేపిస్తూ ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.