NewsProgramms

చిరస్మరణీయుడు శ్రీ వాకంకర్

202views

న దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వాకంకర్ ను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పేర్కొన్నారు. సంస్కార భారతి వ్యవస్థాపకులైన శ్రీ వాకంకర్ శత జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఒక ఇంట్లో సంస్కార భారతి సహాయ కార్యదర్శి శ్రీ గూటాల కుమార్ కలిసి శ్రీ వాకంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మన దేశంలో దువా చిత్రకళకు శ్రీ వాకంకర్ పితామహుడు అని ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస్ తెలిపారు.

40 వేల సంవత్సరాల క్రితం నాటి భీమ్ బట్కా గుహలలోని చిత్రాలను వెలికి తీయడం ద్వారా భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని ఆయన ప్రపంచానికి చాటరన్నారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి మీద విదేశీయులు జరుపుతున్న దుష్ప్రచారాన్ని కూడా శ్రీ వాకంకర్ తిప్పి కొట్టారని శ్రీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

అంతేకాకుండా అంతరించిపోయిన సరస్వతి నది జాడను తెలుసుకుని ప్రపంచానికి తెలియజేశారని శ్రీ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.