News

రికార్డు సృష్టించిన ‘రామాయణం’

705views

33 ఏళ్ల తర్వాత కూడా రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ ధారావాహిక తన సత్తా చాటుతోంది. భారత టెలివిజన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ బుల్లి తెర సీరియల్‌ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు దూరదర్శన్‌ తాజాగా ట్విటర్‌లో పేర్కొంది. ఏప్రిల్‌ 16న ఈ సీరియల్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది. ఇంత మంది వీక్షించడం ప్రపంచ రికార్డని తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల వినోదం కోసం ఈ ధారావాహికను పునఃప్రసారం చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇది ప్రేక్షకులను అలరిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.