News

అయోధ్యలో ప్రత్యేక ప్రార్థనలతో రామమందిర నిర్మాణ పనులు ఆరంభం

866views

యోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సోమవారం ప్రారంభించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు బిమ్లేంద్ర మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

దేవతా విగ్రహాలను తాత్కాలిక నిర్మాణానికి మార్చడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆలయం పూర్తయ్యే వరకు విగ్రహాలు తాత్కాలిక నిర్మాణంలో ఉంటాయి.

కరోనావైరస్ నేపథ్యంలో అనేక పరిమితుల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. విగ్రహాలకు ప్రత్యేక పూజలు మంగళవారం కొనసాగుతాయి. అలాగే విగ్రహాలను బుధవారం ఉదయం తాత్కాలిక నిర్మాణానికి మారుస్తారు.

సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందు ఫిబ్రవరిలో ఈ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసినదే.

కరోనావైరస్ ముప్పు కారణంగా, అయోధ్యకు చెందిన వారినేవ్వరినీ ఈ ప్రత్యేక ప్రార్ధనలకు ఆహ్వానించలేదని రామ్ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చపాత్ రాయ్ చెప్పారు.

“మేము మార్చి 24 వరకు పరిస్థితులపై నిఘా ఉంచుతాము. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాము” అని ఆయన చెప్పారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం నాటి అయోధ్య పర్యటన ఇంకా ఖరారు కాలేదని శ్రీ రాయ్ పేర్కొన్నారు. “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల భద్రతకు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. ఇది ‘రాజు’ యొక్క మొదటి కర్తవ్యం” అని ఆయన అన్నారు.

మార్చి 25 న, రాజస్థాన్లోని జైపూర్ కి చెందిన చేతివృత్తులవారు తయారు చేసిన 9.5 కిలోల వెండి సింహాసనంపై విగ్రహాలను ఉంచుతారు.

అయితే కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని దేవాలయాలను మూసివేయాలని అయోధ్య పురపాలక శాఖ ఆదేశించి ఉంది. అలాగే రామ్ నవమి మేళాకు కూడా అయోధ్యలో యాత్రికుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించిన విషయం కూడా మనకు తెలిసిందే.

PTI సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.