News

ప్రభుత్వాల నిబంధనలు, సూచనలు పాటించండి – ఆరెస్సెస్

1.3kviews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం మనకు తెలిసినదే.

ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ కార్యకర్తలు, స్వయం సేవకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలను తూచా తప్పకుండా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల నాయుడు ప్రకటన విడుదల చేశారు. VSK పాఠకుల కోసం ఆ ప్రకటన యధాతధంగా…..

నమస్తే..

రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చ్ 31 వరకు మొత్తం రాష్టాన్ని లాక్ డౌన్ గా ప్రకటించిన సందర్భంగా సూచనలు:–

* అన్ని కార్యక్రమాలు రద్దు చెయ్యాలి.కార్యకర్తల పర్యటన,గృహసంపర్కం వద్దు.

*ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగాల ఆదేశాలను పాటిస్తూ అందరినీ మానసికంగా సన్నద్ధం చేయాలి.సామాజిక అవసరాలు గుర్తించి అధికారులకు తెలియచేయాలి.వారి సలహాలు తీసుకుని తగిన చర్యలు చేపట్టాలి.

ఉగాది –

– 4,5 గురు స్వ.సే ఒకచోట ఆద్య సర్ సంఘచాలక్ ప్రణామ్ చేసి డాక్టర్జీ జీవితం స్మరించుకుని లేదా పుస్తకం చదివి ప్రార్ధన చేయవచ్చును(నియమాలు పాటిస్తూ).

– 4,5 గురు ఒక చోట కలిసే వాతావరణం లేకపోతే స్వ.సే.తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కూడా పైన చెప్పిన విధంగా చేయవచ్చును.

– పచ్చడి వితరణ వద్దు.

నిత్య శాఖ విషయంలో కూడా ఇలాగే 4,5గురు కలిసి లేదా స్వ.సే తన ఇంటిలో ప్రార్ధన చేయవచ్చను.(ఈ పద్ధతి ఆంక్షలు ఉన్నంతవరకు మాత్రమే.ఆంక్షలు తొలగిన తర్వాత మన శాఖలు యధాతధంగా నడవాలి).

భవదీయ

వేణు గోపాల నాయుడు, ప్రాంత కార్యవాహ,

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, ఆంధ్రప్రదేశ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.