
గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేర కరోనా (కోవిడ్ -19)ను నియంత్రించడానికి ది .22/03/2020 ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూ లో భాగం గా రేపు ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు ఎవరూ ఇంటినుండి బయటకు రావద్దని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తద్వారా కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని సేవాభారతి మండల కన్వీనర్ శ్రీ రెళ్ళు గంగాధర్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం లో గుత్తెనదీవి ,జి. వేమవరం ,పెదమడి, కేసనకుర్రు ,జి.మూలపొలం గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామీణులకు తెలియజేస్తూ ఇంటింటికీ కరపత్రాలను సేవా భారతి కార్యకర్తలు పంపిణీ చేశారు.

ఈ సందర్భం గా కార్యకర్తలకు శ్రీ రెల్లుగ గంగాధర్ మాస్కులు వితరణ చేశారు . ఈ కార్యక్రమం లో సాధనాల త్రిమూర్తులు ,సలాది శ్రీనివాస రావు ,పుల్లెపు వెంకటేశ్వర రావు ,కర్రి వెంకటేశ్వర రావు ,పేరాబత్తుల రామకృష్ణ ,సీమకుర్తి ప్రసాద్ ,ఆకుల సత్తిబాబు ,రాయపురెడ్డి జాని, బొక్కా లక్ష్మీనారాయణ , చోడిశెట్టి రమేష్ ,గుత్తుల శ్రీను ,రేవు సింహాచలం తదితరులు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమం లో 20 మంది కార్యకర్తలు గ్రామానికి ఐదుగురు చొప్పున వెళ్ళి 5 గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు దగ్గు ,తుమ్ము ,జలుబు వచ్చినపుడు గుడ్డ తో ముక్కు నోరు కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ,అనవసర ప్రయాణాలు చేయకూడని ,గుంపులు గుంపులు గా తిరగడకూడని వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని రాకుండా చేసుకోవచ్చని వివరించారు .





