NewsProgramms

కృష్ణా జిల్లాలో SSF ధార్మిక సభలు

200views

మరసతా సేవా ఫౌండేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ధార్మిక సభలు నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా కృష్ణా జిల్ల్లాలో కొన్ని గ్రామాలలో ధార్మిక సభలు జరిగాయి.

బాపులపాడు మండలంలో…..

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెంలో SSF ధార్మిక సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు SSF పశ్చిమ కృష్ణా డివిజన్ కన్వీనర్ శ్రీ జయశంకర్ మరియు శ్రీమహావిష్ణు లోకకళ్యాణసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు, పాంచరాత్ర ఆగమపండితులు శ్రీ మారేపల్లి శ్రీనివాసాచార్యులు, బాపులపాడు మండల సహాయ కన్వీనర్ శ్రీ పలగాని రఘు, శ్రీ జయశంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో మన హిందూ ధర్మం యొక్కవిశిష్టతను తెలియచేస్తామని తెలిపా రు.శ్రీమహావిష్ణు లోకకళ్యాణసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు, పాంచరాత్ర ఆగమపండితులు శ్రీ మారేపల్లి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ మన సమరసతా సేవా ఫౌండేషన్ చేసే పనుల గురించి వివరించారు. బాపులపాడు,సింగన గూడెంలలో  తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించమని అక్కడి పెద్దలు కోరారు. పెద్దల కోరిక మేరకు తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తానని బాపులపాడు మండల ధర్మ ప్రచారక్ శ్రీ యడవల్లి పాండురంగారావు వారికి హామీ ఇచ్చారు.

విస్సన్నపేట మండలంలో…..

అలాగే విస్సన్నపేట మండలం చండ్రుపట్ల పంచాయితీలో గ్రామ ధార్మిక సమావేశం  జరిగినది. ఈకార్యక్రమంలో పశ్చిమ కృష్ణ డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీ జయశంకర్, పశ్చిమ కృష్ణ మహిళా సహ కన్వీనర్ నాగరాజకుమారి గారు,ఉపమండల కన్వీనర్ శ్రీ చిల్లపల్లి జమలయ్య, గ్రామ కన్వీనర్ శ్రీ బాలకొండయ్య, గ్రామస్తులు ,మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో నాగరరాజ కుమారి గారు గ్రామస్తుల చేత  ప్రతిజ్ఞ చేయించారు  ….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.