NewsProgramms

గిరిజన మహిళల గళాన్ని వినిపించిన చైతన్య సదస్సు

251views

మాజ రథసారథులు, నిర్మాతలు, ధర్మ, సంస్కృతి పరిరక్షకులు మాతృమూర్తులేనని ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ లో నిర్వహించిన గిరిజన మహిళల చైతన్య సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఉత్తమమైన పౌరులను సమాజానికి అందించగలిగే శక్తి మాతృమూర్తులకు మాత్రమే సొంతమని, తమ పిల్లలని సంస్కారవంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే మహిళలు సమాజానికి చేసే గొప్ప ఉపకారమని అందుకే యావత్ సమాజము మహిళలకు ఋణపడి ఉంటుందని ఆయన తెలిపారు.

ఒక చత్రపతి శివాజీని సమాజానికి అందించింది జిజియా మాత అని, ఒక వివేకానందను సమాజానికి అందించింది భువనేశ్వరి దేవి అని అలా ఉత్తములైన వ్యక్తులుగా తమ కుమారులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళల దేనని ఆయన తెలిపారు.

భారతీయ సంస్కృతికి మూలాధారం గిరిజన సంస్కృతేనని కనుక గిరిజన సంస్కృతిని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకున్నట్టేనని, కనుక గిరిజన సంస్కృతిని కాపాడుకోవడం యావత్ హిందూ సమాజం యొక్క తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

అనంతరం జిల్లా న్యాయ సాధికార సేవా సంస్థ కార్యదర్శి శ్రీమతి టీజే సుధ మాట్లాడుతూ గిరిజనులకు, ముఖ్యంగా గిరిజన మహిళలు కలిగిన హక్కులు, వారి పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు, వాటిని ఉపయోగించుకో వలసిన పద్ధతుల గురించి వివరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి శ్రీమతి విద్యా వాణి, గిరిజన సేవా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పోట్లూరి విజయలక్ష్మి, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ యాకశిరి వెంకటేశ్వర్లు, సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి, ట్రస్టీ శ్రీ గుఱ్ఱం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు సమీప గ్రామాల గిరిజన కుల పెద్దలు, మహిళామూర్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.