NewsProgramms

మచిలీపట్నం, కర్నూలు, విజయవాడలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు

294views

మచిలీపట్నంలో…..

చిలీపట్నం నగరంలో ఛత్రపతి శివాజీ శాఖ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంలో 22 మంది స్వయం సేవకులు ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవాన్ని సందర్శించడానికి 30 మంది స్వయంసేవకుల తోపాటు నగరంలోని పెద్దలు, మాతృమూర్తులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలబాను హైస్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీ Ch S N రాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ తూర్పు కృష్ణ జిల్లా ప్రచరక్ శ్రీ రాజశేఖర్ మాట్లాడుతూ స్వయంసేవకులు శాఖలో సాధన చేసే వివిధ శారీరిక, బౌద్ధిక్ విషయాల కారణంగా సహజంగా వారిలో సంస్కారాలు, దేశభక్తి వికసిస్తాయని తెలిపారు. అందుకే శాఖలో నిర్మాణమైన స్వయంసేవక్ అన్ని రంగాలలో అగ్ర స్థానంలో ఉండగలుగుతాడని పేర్కొన్నారు. ఏడాది పాటు వారు తమ దైనందిన శాఖలో సాధన చేసిన విషయాలను వారి పెద్దలకు, సమాజానికి తెలియపరచటమే ఈ వార్షికోత్సవం ఉద్దేశ్యమని తెలిపారు. తూర్పు కృష్ణ జిల్లా సహ కార్యవాహ శ్రీ బి.సుజయ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

కర్నూలులో…..

 

అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కర్నూలు నగరంలోని రాణాప్రతాప్ శాఖ వార్షికోత్సవం జరిగింది.ఈ వార్షికోత్సవం లో స్వయంసేవకులు నేర్చుకున్న కర్రసాము, కరాటే,యోగ, సూర్యనామస్కర్, ఘోష్(RSS బ్యాండ్) ప్రదర్శన చేశారు.ఈ వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా విచ్చేసిన కర్నూలు విభాగ్ కార్యకారిణి సభ్యులు శ్రీ గూడ రఘురామయ్య గారు మాట్లాడుతూ సంఘ శాఖ వ్యక్తిలో సంస్కారం, దేశభక్తిని నింపుతుంది అని సమాజంలో అన్ని సమస్యల పరిష్కారం చూపే శక్తి శాఖ ద్వారా తయారు అయిన స్వయంసేవక్ వద్ద ఉంటుందని, నానాజీ దేశముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజపేయి, మోడీ వంటి వారు ఉదాహరణ అని చెప్పారు.సంఘ అనేక సేవ కార్యక్రమలు(ఫ్రీ ట్యూషన్ సెంటర్స్,కుట్టు శిక్షణా కేంద్రాలు మోదలగునవి) చేస్తుంది అని అందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బస్తి వాసులు, స్వయంసేవకులు కుటుంబాలతో పాల్గొన్నారు. మహిళలు, బాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంసేవకులు చేసిన ప్రదర్శనలు చూసి ఆనందించారు. కార్యక్రమంలో నగర, భాగ్ కార్యవాహలు మాధవ్, శేఖర్, విశ్వనాథ్ మొదలగువారు పాల్గొన్నారు.

విజయవాడలో…..

విజయవాడలోని అయోధ్యనగర్ శాఖా వార్షికోత్సవం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజినీర్, SAKSHAM సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు  శ్రీ తారనాథ్ అధ్యక్షత వహించగా విజయవాడ మహానగర్ వ్యవస్థా ప్రముఖ్ శ్రీ దివ్వెల కృష్ణ ముఖ్య వక్తగా విచ్చేశారు. కార్యక్రమంలో అయోధ్య నగర్ నగర కార్యవాహ శ్రీ అప్పలరాజు, ఇతర పెద్దలు, మాతృమూర్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.