News

ఢిల్లీ అల్లర్లలో తేలిన ISIS ప్రమేయం

397views

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబధాలున్నట్లు గుర్తించిన సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ దంపతులను జామియా నగర్ లోని వాళ్ల నివాసంలో అరెస్ట్ చేశారు.

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ఈ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాకుండా, ఉగ్రదాడులకు పాల్పడేలా ముస్లిం యువతను ఈ దంపతులు ప్రేరేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జహన్‌ జేబ్, హీనాలు అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్‌ సభ్యులతో రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

అలాగే ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. కాగా, జహన్‌బెబ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్‌ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్‌ మస్లిమ్స్‌ యూనిటీ పేరిట సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినట్టుగా సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.