News

రోడ్లపై నమాజ్ అంటే అదో రకమైన ఉగ్రవాదమే : సురేంద్ర జైన్

25views
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడం అనేది కేవలం ప్రార్థన కాదని, అది ఒక విధమైన రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు. అలాగే ఆ చర్య రాజ్యాంగ విరుద్ధమని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా మానవతా విలువలకు మరియు ఇస్లాం సూత్రాలకు కూడా విరుద్ధం. దీనివల్ల కలిగే ప్రతికూల పరిణామాలను దృష్టిలో ఉంచుకునే, ఏడు హైకోర్టులు రహదారులపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయని గుర్తు చేశారు.
మరో వైపు సుప్రీం కోర్టు కూడా ఇదే తరహా సంకేతాలను ఇచ్చిందని, వీటన్నింటినీ బట్టి చూస్తే రోడ్లపై నమాజ్ చేయడం అంటే న్యాయవ్యవస్థను ధిక్కరించడమేనని స్పష్టం చేశారు. అయితే.. ఇదేమీ కేవలం ఐదు నిమిషాల వ్యవహారం కాదన్నారు.
ఢిల్లీలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద, రైలు పట్టాలపై కూర్చుని ప్రార్థనలు జరిపినప్పుడల్లా, రైలు సేవలు గంటల తరబడి స్తంభించిపోయేవని అన్నారు.. గురుగ్రామ్ గుండా వెళ్లే జైపూర్ రహదారిపై, ట్రాఫిక్ జామ్‌లు ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు కొనసాగేవి. పాఠశాల బస్సులు ఆ ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకుపోవడంతో, చిన్నారులు తీవ్రంగా రోదించేవారని గుర్తు చేశారు.
అనేక ముస్లిం దేశాలలో కూడా రోడ్లపై నమాజ్ చేయడం నిషేధమని, ఏ నాగరిక సమాజంలోనూ దీనిని అనుమతించడం సాధ్యం కాదన్నారు.భారతదేశంలోనే ఇలా చేయడానికి వారు ఎందుకు పట్టుబడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మసీదులలో స్థలం దొరకడం లేదన్న కారణంతోనే తాము వీధుల్లోకి వస్తున్నామని వారు పేర్కొంటున్నారు. గుర్గావ్‌లో 38 వేర్వేరు ప్రదేశాల వద్ద రహదారులను దిగ్బంధించి ప్రార్థనలు నిర్వహిస్తున్నప్పుడు, స్థానిక సమాజం తీవ్ర ఆగ్రహానికి గురైందని పేర్కొన్నారు.
ఇలా రోడ్లపై నమాజ్ చేయడం అంటే తమ బలాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుందన్నారు. దీని ద్వారా పరిపాలనా యంత్రాగాన్ని, హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే అవుతుందని, ఇదో రకమైన ఉగ్రవాదమని మండిపడ్డారు.
రోడ్లపై నమాజ్ చేయడాన్ని కఠినంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. లాగే ప్రతి ఒక్కరూ న్యాయవ్యవస్థను మరియు రాజ్యాంగాన్ని గౌరవించేలా ప్రోత్సహించాలని ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మౌల్వీలు కూడా ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదం వైపుకు మళ్ళించే మరో మార్గంలోకి నెట్టే బదులు, వారు చట్టాన్ని పాటించేలా ప్రేరేపించాలని సూచించారు.