
1.1kviews
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో గల పక్షి మోచన తీర్ధ స్థలంలో, ఎండోమెంటు భూమిలో చర్చి నిర్మాణం జరిగింది. దీనికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి పంచాయితీ ఈవో, ఎండోమెంటు ఈవో ఎంత సొమ్ముకు అమ్ముడు పోయారు? ఏమిటి ఈ ఈవోల అవినీతి మరియు దుర్మార్గం అని కూడా వారు వాపోతున్నారు. వెంటనే పై అధికారులు, ప్రభుత్వం స్పందించి సదరు చర్చీని తొలగించ కుంటే, ప్రధాన ఆలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని విశ్వహిందూపరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, న్యాయవాది, చంద్రశేఖర పట్నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





