News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

16views

రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి రైతు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిరంతరంగా ఆదాయం వచ్చే విధంగా పంటల ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మంచి గిరాకీ ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం లభిస్తుందని తెలిపారు.

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, విబిజి రాంజీ పథకం ద్వారా వివిధ రకాల పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పప్పులు, నూనె పంటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి పంటలను ప్రకృతి విధానంలో సాగు చేసే విధానాలను ఆయన పరిశీలించారు.

ఖరీఫ్ మరియు రబీ మధ్య బీడుగా ఉండే కాలంలో కూడా డ్రై సోయింగ్ ద్వారా పంటలు సాగు చేయవచ్చని సూచిస్తూ, రైతులు ఈ పద్ధతులను అనుసరించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.