
34views
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి ధ్వజస్తంభానికి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాగే వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను సందర్శించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.




