
43views
భారత్, చైనా నరకకూపాలంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకీభవించడంపై డెమోక్రాట్లు మండిపడ్డారు. భారతీయ అమెరికన్లనే కాదు, ప్రపంచంలో అమెరికాకు కీలక భాగస్వామైన భారత్ ను కూడా అధ్యక్షుడు అవమానించారని డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి అన్నారు. భారత సంతతి వ్యక్తులను ట్రంప్ తక్కువ చేసి చూపిస్తున్నారని, దీనిపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించాలని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. రేడియో ప్రయోక్త మైఖేల్ సావెజ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించి అధ్యక్ష కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారని మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా పేర్కొన్నారు. భారత్ ను నరకంతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే





