News

సాధువు పేరుతో కిడ్నాప్ చేస్తున్న బంగ్లాదేశ్ ట్రాన్స్ జెండర్

23views

బంగ్లాదేశీ ట్రాన్స్ జెండర్ అయాన్ ఖాన్ (గురుమా లేదా బాబు హిజ్రా) ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గోవండిలోని శివాజీ నగర్ కి చెందిన 17 ఏళ్ల బాలుడ్ని జారా అనే సహచరుడి సహాయంతో అయాన్ ఖాన్ అపహరించింది. అంతేకాకుండా లైంగికంగా కూడా వేధించింది. దీంతో ఆ 17 ఏళ్ల బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి పోలీసులు ఆ మైనర్ బాలుడ్ని రక్షించి, తిరిగి కుటుంబానికి క్షేమంగా అప్పగించారు.

మరోవైపు అయాన్ ఖాన్ మహిళల దుస్తులు ధరించి వుండడాన్ని చూసి కుటుంబీకులు షాక్ కి గురయ్యారు. మొదట్లో సంకోచిస్తూ, భయపడిన ఆ బాలుడు, తాను ఒక అమ్మాయిలా జీవించాలనుకుంటున్నానని చెప్పినట్లు సమాచారం.

మరోవైపు ఖాన్ పై పోలీసులు పోక్సో కేసుతో పాటు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఖాన్ పోలీసుల అదుపులోనే వున్నాడు. ఇక.. ఇన్నేళ్లుగా అక్రమంగా నివసిస్తున్నదుకు అతనికి ఎవరెవరు సహాయం చేశారో కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తనను తాను ఖాన్ గురువుగా పరరిచయం చేసుకున్నాడని, తన పేరు గురుమా, జ్యోతిమా అంటూ పలు పేర్లతో వుంటున్నట్లు కూడా పోలీసులు పేర్కొంటున్నారు.ఫీక్ నగర్ పార్ట్-2లో నివసించేవాడు. ఆ ప్రాంతంలో, ఖాన్‌కు 300 మందికి పైగా అనుచరులపై ఖాన్ ప్రభావం వున్నట్లు సమాచారం.

నిజానికి ఖాన్ ది బంగ్లాదేశ్ లోని బసత్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఖాన్ అరెస్టుతో ముంబైలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను కూడా మరి కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.అక్రమ పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పంపుతున్నట్లు కూడా తేలింది. దీంతో పోలీసులు ఈ ఆర్థిక లింకులను దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రకారం ఈ డబ్బును బంగ్లాదేశ్ లో రియల్ ఎస్టేట్ లో, వ్యాపారంలో పెడుతున్నట్లు తేల్చారు కూడా.

నిజానికి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నందుకు అయాన్ ఖాన్ ఆరు నెలల క్రితమే అరెస్టయ్యాడు. అక్రమ చొరబాటుదారు అయినా.. ముంబైలో లక్షల్లో విలువైన ఆస్తులను సంపాదించాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా వెల్లడించారు.