News

దేశ వ్యాప్తంగా ఊపందుకుంటోన్న ఘర్ వాపసీ కార్యక్రమం : అలోక్ కుమార్

88views
దేశ వ్యాప్తంగా ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోందని, ఇదంతా వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువుల సమష్టి కృషి అని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ముంబై, పాల్ఘర్, థానే, రాయగఢ్, రత్నగిరి, సింధు దుర్గ్, గోవా ప్రాంతాలలో ఐదు రోజుల పాటు ‘‘సంత సంవాద్’’ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గోవాలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సమాజ చైతన్య కార్యక్రమాలలో సాధు సంతులు పాల్గొనడానికి క్రియాశీలకంగా ముందుకు వస్తున్నారని అన్నారు.
‘సంత దర్శన్’ మరియు ‘సంత సంవాద్’ వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా, మత మార్పిడుల వంటి అంశాలపై సాధు సమాజం సమాజంలో అవగాహన పెరుగుతుందని, దీని ద్వారా ప్రజలు తమ సాంస్కృతిక మూలాలవైపు తిరిగి వచ్చేలా ప్రేరణ ఇస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 850 సున్నిత ప్రాంతాలను తాము గుర్తించామని, మత మార్పిళ్లను నివారించేందుకు వివిధ స్థాయిల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సాధు సంతుల కారణంగా సమాజంలో చైతన్యం పెరుగుతోందని, అనేక ప్రాంతాలలో తిరిగి ప్రజలు హిందూ ధర్మాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారన్నారు. అలాగే మరి కొందరు కూడా తిరిగి హిందూ ధర్మంలోకి రావాల్న కోరికను వ్యక్తం చేస్తున్నారని, వారిని సంప్రదాయ క్రతువుల ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకుంటామని అలోక్ కుమార్ ప్రకటించారు.
సాధు సంతుల ద్వారా సమాజంలో విపరీతమైన మార్పు వస్తోందని, వారి ద్వారానే తాము కూడా మరింత చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తామన్నారు. మతపరంగా, ధర్మపరంగా ప్రజల్లో జాగృతి వస్తోందని, దీని ద్వారా మత సాంస్కృతిక మూలాలవైపు వస్తున్నారన్నారు.