News

ఢిల్లీలో కాలువలో బయటపడ్డ మరో మూడు మృతదేహాలు

1.9kviews

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతదేహాన్ని జాఫ్రాబాద్‌లోని కాలువ నుంచి వెలికితీసిన ఒక రోజు తర్వాత, గోకుల్‌పురి ప్రాంతంలోని మరో కాలువ నుంచి మరో మూడు మృతదేహాలను పోలీసులు గురువారం (ఫిబ్రవరి 27) స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలోని కాలువల్లో ఇంకేమైనా మృతదేహాలు ఉన్నాయో, లేవో నిర్ధారించుకోవడానికి పోలీసులు స్థానిక ఈతగాళ్ళ సహాయం కూడా కోరుతున్నారు.

కొంతమంది స్థానికులు గోకుల్‌పురి కాలువ వద్ద పోగుచేసిన చెత్త నుండి ఒక చేయి బయటకు రావడాన్ని చూసి పోలీసులకు తెలిపారు.

“ఈతగాళ్ళు కుళ్ళిన మొదటి శరీరాన్ని బయటకు తీశారు. లోపల ఇంకా ఎక్కువ ఉండవచ్చని మేము అనుమానించాము, దాంతో ఈతగాళ్ళు మళ్లీ లోపలికి వెళ్ళారు. అరగంట తరువాత, మరొక మృతదేహాన్ని బయటకు తీశారు. మొదటిది చెత్త దగ్గర దొరికింది. రెండవది కాలువలో లోతులో ఉంది, ”అని ఒక అధికారి పేర్కొన్నారు.

ఈ కాలువ బ్రిజ్‌పురి మరియు ముస్తఫాబాద్ నుండి ఈశాన్య ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు కిలోమీటర్ పొడవున ప్రవహిస్తుంది.

గురువారం కుళ్ళిపోయిన స్థితిలో కనుగొన్న మూడు మృతదేహాలను గురు తేజ్ బహుద్దూర్ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

“ఈశాన్య జిల్లాలో కాలువల నుండి నాలుగు మృతదేహాలను కనుగొన్నాము. ఇది సోమవారం మరియు మంగళవారం హింస జరిగిన ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో తప్పిపోయిన వ్యక్తుల జాబితా మా దగ్గర ఉంది. దాని ఆధారంగా మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఇళ్ళు, భవనాలను శోధించడానికి స్థానిక పోలీసు బృందాలను నియమించాం. కాలువలలో ఇంకేమైనా మృతదేహాలు దొరుకుతాయేమోనని వెదుకుతున్నాం. ” అని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

Source : Swarajya

https://m.ritam.app/Encyc/2020/2/28/north-east-delhi-violence-three-more-bodies-recovered-from-drains-investigations-underway.amp.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.