News

‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..

69views

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా రికార్డులు బద్ధలవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, ఉగ్రవాద లింకులు, పాక్ రాజకీయాలే బ్యాక్‌డ్రాప్‌గా నిర్మించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

అయితే, ధురంధర్ సినిమా మొత్తం కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతంలోని గ్యాంగ్ వార్స్ గురించి సినిమాలో చూపించారు. అయితే, ఇప్పుడు ధురంధర్ భారీ సక్సెస్ కావడంలో ఈ సినిమా వసూళ్లలో తమకు కూడా వాటా కావాలని ల్యారీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సినిమా వసూళ్లలో 80 శాతం ల్యారీ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని కోరారు. ఈ సినిమాలో తమ ప్రాంతం పేరు వాడుకున్నందుకు ఆర్థికంగా తమకు డబ్బులు ఇవ్వాలని కోరుతుున్నారు. కొందరు భారత్ డబ్బులు ఇస్తేనే ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు మెరుగవుతాయని అన్నారు.