
141views
తెలుగులో తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య భారీ పంచలోహ విగ్రహాన్ని అమెరికాలోని టెనెసీ రాష్ట్రం మెంఫిస్ సిటీలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ (ఐసీసీటీ)లో ఏర్పాటు చేయనున్నారు. 111 అడుగుల ఎత్తుతో 75 టన్నుల పంచ లోహాలతో రూపొందించే ఈ విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ త్రీడీ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తున్నారు. విగ్రహాన్ని విడి భాగాలుగా రూపొందించి నౌకలో అక్కడికి తరలించాక 160 టన్నుల ఉక్కు చట్రంపై అమర్చి తుది రూపమిస్తారు. 2028 మే 9 (అన్నమయ్య జయంతి)న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఐసీసీటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రసాద్ దుగ్గిరాల, విజయ తెలిపారు.






