News

సేవా బస్తీల్లో కాషాయ జెండాలు, కాషాయ తోరణాలు,దీక్షా దుస్తుల పంపిణి

128views

నంద్యాల, జ్యేష్ట కార్యకర్త నగర ప్రచార ప్రముఖ్ శ్రీ చింతల పల్లి వాసు ఆధ్వర్యంలో బైటి పేట, అరుందతి నగర్ లో ఇంటింటికి కాషాయ జెండాలు, తోరణాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ గోళ్ళ సుదర్శన్, శ్రీ పాలూరు సుబ్బారావు, శ్రీ ఆది నారాయణ, బిజెపి నాయకుడు శ్రీ శంకర్, శ్రీ సాత్విక్ రెడ్డి, అరుంధతి నగర్ కు చెందిన శ్రీ నర్సింహ. మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సుదర్శన్ మాట్లాడుతూ, గతంలో కూడా శ్రీ వాసు భవాని దీక్షా దుస్తులు, ముగ్గుల పోటీలు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పేదవారికి చేయడం వల్ల వాళ్లకు మనోధైరం కలుగుతుందని పరాయి ధర్మం వైపు కన్నెత్తి చూడరని తెలిపారు

శ్రీ పాలూరు సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఉగాది నాడు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఒకరికి ఒకరు సోదర సోదరీ భావాలు కలిగి ఉంటూ ఎల్లప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని తెలిపారు.

చింతలపల్లి వాసు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి ఇలాంటి సేవా కార్యక్రమంలో దాతల సహకారంతో చేస్తున్నానని దాతలు లేకుంటే తాను ఇలాంటి కార్యక్రమాలు చేయటం సాధ్యమయేది కాదని, వారి సహకారం ఇలాగే కొనసాగితే ముందు ముందు మరిన్ని కార్యక్రమాలను చేస్తానని తెలిపారు. అలాగే మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మం మారడం సరైన పద్దతి కాదని, ధర్మం మారితే తల్లిని మార్చుకున్నట్టే అని తెలిపారు.