News

యూపీలో బయటపడ్డ బంగారు గని

1.2kviews

త్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోన్‌పహాడీలో 2700 టన్నులు, హార్దీలో 650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నిక్షేపాలను తవ్వితీసే మైనింగ్‌ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సర్వే కొనసాగుతోంది. ఈ-టెండరింగ్‌ ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇక్కడ బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Close up lump of gold mine on wooden table

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.