
లవ్ జీహాద్..మదోన్మాది వికృతానికి రాష్ట్రంలో మరో హిందూ విద్యార్థిని బలైంది.. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు..
అదే కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న రహీమ్ అనే కామ పిశాచి ఆ విద్యార్థినిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. మాటలతో నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
అయితే, అక్కడితో ఆగక, ఆమెకు తెలియకుండానే వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో కొన్ని అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించాడు..
కొంతకాలం తర్వాత రహీమ్ ప్రవర్తనలో మార్పు రావడంతో, విద్యార్థిని అతనిని దూరం పెట్టడం ప్రారంభించింది. అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు తన వద్ద ఉన్న వీడియోలను ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ వీడియోలను ఆమెకు వాట్సాప్ చేసి, తను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్) పెడతానని భయపెట్టడం మొదలుపెట్టాడు.
సుమారు నెల రోజులుగా ఈ బ్లాక్‌మెయిల్ కొనసాగింది. “నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నా కోరిక తీర్చకపోతే అందరికీ చూపిస్తాను” అంటూ తోటి విద్యార్థుల ముందే అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగక, ఆ వీడియోలను కళాశాలలోని పలువురు విద్యార్థులకు, ఒక సీనియర్ విద్యార్థికి పంపించాడు. ఈ విషయం కళాశాల అధ్యాపకుల వరకు చేరినా, యాజమాన్యం సరైన సమయంలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. తన వీడియోలు అందరికీ చేరాయన్న అవమానాన్ని, మనోవేదనను ఆ యువతి తట్టుకోలేకపోయింది. శుక్రవారం తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేనిది చూసి సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..
మరో హిందూ ఆడపడుచు ఒక ముస్లిం చేతిలో లవ్ జీహాద్ కు గురయ్యింది..ప్రాణాలు తీసుకుంది..





