
CAA గురించి అవగాహన లేకపోవడం వల్లనే దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని RSS క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ అన్నారు. Rss ఒంగోలు శాఖ నగర సాంఘిక్ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు పాల్గొని ప్రసంగించారు. ఇంకా వారు మాట్లాడుతూ, 1947 లో దేశ విభజన మతప్రాతిపాదికన జరిగిన విషయం అందరికీ తెలిసినదేనని ఐతే ఇరు దేశాలలో ఉన్న మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ బాధ్యత ఇరుప్రభుత్వాలు చూడాలని ఒప్పందం జరిగిందన్నారు.
ఐతే ఈ ఒప్పందాన్ని భారతప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిన కారణముతో ఈ దేశంలోని ముస్లిమ్ మైనారిటీ ప్రజలు హాయిగా ఉన్నారని వారి జనభా కుడా ఎన్నోరెట్లు పెరిగిందని చెప్పారు.

అదే సమయములో పాకిస్తాన్, బాంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్న హిందు, సిఖ్, పార్సీ, బౌద్ధ లాంటి మైనార్టీ జనాభాపై అనేకరకాల దాడులు జరుగుతున్నాయి. వారు బలవంతంగా మతం మార్చబడటమో లేక ఛంపివేయబడటమో,లేక వారి దాడులకు జడసి భారత్ లాంటి దేశాలకు పారిపోయి రావడమో జరుగుతున్న పరిస్థితి ఉన్నదని వారు అన్నారు. అలా శరణార్థులుగా వచ్చినవారికి నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం కల్పిచడమే CAA చట్టం ఉద్దేశ్యమని వారు తెలిపారు. దీనివల్ల ఈ దేశములో ఉన్న ముస్లిములకే కాక మరే వర్గానికీ నష్టం లేదన్నారు.
కానీ కొంతమంది ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించే ఉద్దేశ్యంతో కుట్రపూరితముగా కొన్నివర్గాలవారిని రెచ్చగొడుతున్నారని, మేధావులు, దేశభక్తులు ఐన వారు దీని గురించి వాస్తవాలు ప్రజలకు వివరించి చెప్పాలని కోరారు.
అలాగే బలవంతపు మతమార్పిడులు చాలా ప్రమాదకరమని వారు అన్నారు.మతం మారినవారు ఈ దేశమును శత్రువుగా, ఈ సంసృతి, సంప్రదాయములను అవహేళన చేయడం మనం చూస్తున్న వాస్తవ దృశ్యాలని తేల్చి చెప్పారు. కాబట్టి భారతదేశ పరమవైభవ స్థితి కోరుకునే ప్రతి ఒక్కరూ అపోహలను ప్రజలలో తొలగించి వాస్తవాలు వివరించి చెప్పడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, నగరంలోని స్వయంసేవక్ లు పాల్గొన్నారు.





