
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అఖిల భారత బంజారా సేవా సమితి (ఏబీబీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర శ్యాంప్రసాద్, ఆల్ ఇండియా బంజార భక్త సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్, సత్యసాయిబాబా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి సేవాలాల్ మహారాజ్ రథయాత్రను ప్రారంభించారు. బంజారా సాంప్రదాయ నృత్యాలు, డప్పులు, గిరిజన పాటలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ బంజార మహిళలతో కలసి నృత్యం చేశారు
ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్, సత్యసాయిబాబా చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి రథయాత్ర ప్రారంభించారు.అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ రథయాత్రలో పాల్గొన్నారు. సత్యమ్మ సర్కిల్ నుంచి గణేష్ కూడలి వరకు ఈ రథయాత్ర సాగింది. దీంతో పుట్టపర్తి పుర వీధులు బంజార పాటలు, నృత్యాలతో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ జయంతలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజంలో మూఢనమ్మకాలు, జంతు బలులను వ్యతిరేకించి, ఆయుర్వేద, ప్రకృతి వైద్యాలను ప్రోత్సహించారని తెలిపారు.





