News

క్యాబ్‌ డ్రైవర్‌ రోహిత్ ను సత్కరించిన భాజపా

677views

హారాష్ట్ర రాజధాని ముంబయి భాజపా నాయకులు శనివారం ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను వినూత్న పద్ధతిలో సత్కరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ముంబయికి వచ్చిన ఓ వ్యక్తిని అతడు పోలీసులకు పట్టించడమే అందుకు కారణం. దీంతో ముంబయి భాజపా చీఫ్‌ మంగళ్‌ ప్రభాత్‌ లోధా సహా పలువురు నాయకులు అతడిని ‘అలర్ట్‌ సిటిజన్‌ అవార్డు’తో సత్కరించారు.
జైపుర్‌కు చెందిన సర్కార్‌ అనే కవి ముంబైలో ఉబెర్ క్యాబ్ ఎక్కి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ “ముంబైని మరో షహీద్ భాగ్ చేద్దాం. దేశంలో అగ్గి రగిలిద్దాం” వంటి వ్యాఖ్యలు చెయ్యడం విన్న ఆ క్యాబ్ డ్రైవర్ రోహిత్ అతడు ఏదో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనున్నాడని అనుమానం వచ్చి అతడిని శాంతాక్రజ్‌ పీఎస్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అనంతరం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న భాజపా నాయకులు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను ‘అలర్ట్‌ సిటిజన్‌ అవార్డు’తో సత్కరించారు.

దీనిపై లోధా ట్విటర్‌లో ప్రస్తావిస్తూ ‘సీఏఏకు వ్యతిరేకంగా కొందరు చేయబోయిన కుట్రను రోహిత్‌ గౌర్‌ అనే డ్రైవర్‌ అడ్డుకున్నాడు. ముంబయి ప్రజల తరపున ఆ బాధ్యత గల పౌరుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సత్కరించాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.