ArticlesNews

క్రైస్తవ మిషనరీల నుండి నాగ వారసత్వాన్ని ఒక యువ రాణి గైడిన్ల్యూ ఎలా కాపాడింది ?

171views

కేవలం 13 సంవత్సరాల లేత వయస్సులో, రాణి గైడిన్ల్యూ రాజకీయ అధికారం కోసం కాకుండా, క్రైస్తవ మిషనరీల నుండి తన ప్రజల అస్తిత్వం (Survival) కోసం పోరాటంలోకి అడుగుపెట్టింది. అదే హేరాకా ఉద్యమం. జనవరి 26, 1915న మణిపూర్‌లోని లాంగ్‌కావో గ్రామంలో జన్మించిన ఆమె, మిషనరీలు నాగ తెగలను వేగంగా మారుస్తూ, వారి పూర్వీకుల విశ్వాసాలను బలహీనపరుస్తూ, సమాజాలను ఎలా చీల్చివేస్తున్నారో కళ్లారా చూసింది. 16 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, ఆమె ఈ ఉద్యమానికి ఊహించని నాయకురాలిగా ఎదిగింది. ఆమె హేరాకా విశ్వాసాన్ని, జెలియంగ్రాంగ్ ప్రజల శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని రక్షించడానికి సంకల్పించింది. కానీ ఆమె చేపట్టిన ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఆమె వారసత్వంగా స్వీకరించిన ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి.

హేరాకా ఉద్యమం బెదిరింపునకు గురైనప్పుడు

మొదట ఆమె బంధువు హైపౌ జాదోనాంగ్ నాయకత్వంలో హేరాకా ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్థానిక నాగ ప్రజల పూర్వీకుల మతాన్ని, ఆచార విశ్వాసాలను కాపాడుకోవడం. అయితే అప్పటికే మిషనరీలు (క్రైస్తవ మత ప్రచారకులు) కొండ ప్రాంతాలలోకి వచ్చి, ప్రజల సామాజిక నియమాలను, నమ్మకాలను, జీవన విధానాన్ని మార్చడం ప్రారంభించాయి. దీనివల్ల మిషనరీల ప్రభావం పెరిగి, వారి చేత ప్రభావితం అయిన వారంతా కలిసి, హేరాకా ఉద్యమ అనుచరులను ఎగతాళి చేయడం లేదా ఒంటరి చేయడం, లేదా తమ పూర్వీకుల నమ్మకాన్ని వదులుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీని వల్ల శతాబ్దాల నాటి ఆచారాలు, దుస్తులు, సంప్రదాయాలు, సామాజిక నిర్మాణాలన్నీ పూర్తిగా మారిపోయి, కనుమరుగు కావడం మొదలయ్యాయి. మొత్తానికి, మిషనరీల మార్పులను నిరోధించి, తమ సాంప్రదాయ నాగ మతాన్ని నిలబెట్టుకోవడానికి హేరాకా ఉద్యమం ప్రయత్నించింది.

ఆగష్టు 29, 1931న జాదోనాంగ్ మరణం తరువాత, 16 ఏళ్ల గైడిన్ల్యూ హేరాకా ఉద్యమానికి నాయకత్వం వహించింది. క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడింది. నాగ ప్రజలు తమ మతాన్ని కోల్పోతే, వారి సంస్కృతి, గుర్తింపు మరియు ఐక్యత కూడా కనుమరుగు అవుతుందని ఆమె గ్రహించింది. దీంతో ఆమె గ్రామగ్రామాన తిరుగుతూ, ప్రజలు తమ పూర్వీకుల దేవతలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను గట్టిగా పట్టుకోవాలని, లేకపోతే మత మార్పిడి నాగ గుర్తింపును చెరిపివేస్తుందని కోరింది. క్రైస్తవ మతం “నాగరికత”కు మార్గం అనే ఆలోచనను ఆమె తిరస్కరించింది. బదులుగా, వారి స్థానిక విశ్వాసం పరిపూర్ణమైనదని మరియు పవిత్రమైనదని ఆమె నొక్కి చెప్పింది.

రాణి గైడిన్ల్యూ హేరాకాను కాపాడటానికి ఎలా కృషి చేసింది

నాగా కొండలలో మిషనరీ కార్యకలాపాలు పెరిగినందున, రాణి గైడిన్ల్యూ అక్టోబర్ 8, 1960న రాణి పార్టీ జెలియంగ్రాంగ్ ను స్థాపించింది. ఇది హేరాకా పునరుద్ధరణకు అంకితమైన ఒక సమాంతర సామాజిక మరియు పరిపాలనా వ్యవస్థ. ఇందులో సుమారు 400 మంది సాయుధ వాలంటీర్లు మరియు 1,000 మందికి పైగా పౌర మద్దతుదారులు ఉన్నారు. వీరంతా హేరాకా విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు మత మార్పిడి ఒత్తిళ్లను ప్రతిఘటించడానికి కట్టుబడి ఉన్నారు.

ఒకసారి, ఒక యువకుడు ఆమె సాంప్రదాయ దుస్తులను చూసి ఆమెను “అపుయ్” (తల్లి) అని సంబోధించినప్పుడు, ఆమె అతనికి ఇలా గుర్తుచేసింది, “నువ్వు నేను మా దుస్తులు ధరించినందున నన్ను గుర్తించావు. అది లేకుండా, మనం ఒకరినొకరు ఎలా తెలుసుకోగలం?” అందువల్ల, మత మార్పిడి ఎదురైనప్పుడు ఐక్యతను బలోపేతం చేయడానికి హేరాకా పురుషులు కాంస్య చెవిపోగులు ధరించాలని మరియు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, సాంప్రదాయ కేశాలంకరణను పాటించాలని ఆమె పట్టుబట్టి, మత సంస్కరణలు, సమాజ క్రమశిక్షణ మరియు సాంస్కృతిక పునరుద్ధరణను ప్రోత్సహించింది. అలా ఆమె అత్యంత ప్రసిద్ధ మాటలు ఆమె ఎలాంటి దూరదృష్టి కలిగి ఉందో తెలియజేస్తాయి: “మతాన్ని కోల్పోవడం అంటే సంస్కృతిని కోల్పోవడం, మరియు సంస్కృతిని కోల్పోవడం అంటే గుర్తింపును కోల్పోవడం.”

ఆమె ఉద్యమం మిషనరీ విస్తరణ యొక్క తుఫాను నుండి హేరాకా మనుగడ సాగించేలా చూసింది మరియు అది ఇప్పటికీ సజీవ ఆధ్యాత్మిక సంప్రదాయంగా మిగిలిపోయింది. నేడు, ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలిగా మాత్రమే కాకుండా, స్థానిక విశ్వాసాన్ని రక్షించిన సాంస్కృతిక సంరక్షకురాలిగా గుర్తుంచుకోబడుతోంది. ఆమె క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా నిలబడింది. తన సంఘం తమని తాము ఎవరో ఎప్పటికీ మర్చిపోకూడదనే ఆమె పట్టుదల, భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన ప్రతిఘటన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.