
200views
రాజస్థాన్ రాజధాని నగరమైన జైపుర్‌లోని సీకర్ రోడ్డులో గల నీందడ్ వద్ద కొనసాగుతున్న పది రోజుల శ్రీరామకథా ప్రవచన కార్యక్రమంలో 15,000 మంది విద్యార్థులు పాల్గొని హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా తులసీ పీఠాధీశ్వరులైన జగద్గురు స్వామీ రామభద్రాచార్య మహరాజ్ మాట్లాడుతూ.. రామ నామ పఠనంలో ఉత్తమ విద్యార్థిగా హనుమంతుడిని అభివర్ణించారు. రామ నామాన్ని హనుమంతుడిలా తమ జీవితాలకు పునాదిగా చేసుకునేవారు శ్రీరాముణ్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటారన్నారు. సూర్యుడిని నోటితో పట్టుకొన్న హనుమంతుడు సీతారాములకు తన హృదయంలో స్థానం ఇచ్చాడని, ఇదే నిజమైన భక్తి సందేశమన్నారు.





