News

నిరుపేదలైన బ్రాహ్మణుల కోసం గరుడ పథకానికి శ్రీకారం

178views

త్వరలో గరుడ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాంప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

గరుడ పథకం నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే రూ.10 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థికసాయంతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్టసమయంలో ఉపశమనం లభిస్తుందన్నారు.దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బ్రాహ్మణులకు పాత పథకాలతోపాటు కొత్త పథకాలూ అమలుచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి వెల్లడిరచారు. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదాయం లేని ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకానికి అర్చకుల గౌరవ వేతనం రూ.7వేలకు, ధూప దీపాల కోసం రూ.3 వేలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో దేవస్థానాల్లో పనిచేసే అర్చకులకు గౌరవ భృతిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. నిరుద్యోగ వేడపండితులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని సంభావన పేరుతో అందజేస్తున్నామన్నారు. ఈ