
ఫిబ్రవరి 1,2 తేదీలలో గుంటూరులోని గుంటూరు కన్వెన్షన్ హాల్ నందు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జరిగాయి. ఈ శిక్షణా తరగతులలో మొత్తం 13 జిల్లాలలోని 67 మండలాల నుండి 257 మంది పాల్గొన్నారు.
ఈ శిక్షణా తరగతులలో రాష్ట్ర మత్స్య శాఖా మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకట రమణ రావు, AFCOF చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ, NFDB చైర్మన్ శ్రీ పంపిరి జనార్థన్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోలంగారి పోలయ్య, RAS టెక్నాలజీ వాడుతున్న రైతు శ్రీ విశ్వనాథ రాజు, అఖిల భారతీయ సీమా సురక్ష ప్రముఖ్ శ్రీ గోపాల కృష్ణన్ లు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమము, అభివృద్ధి కోసం చేయవలసిన కృషిని గూర్చి వివరించారు. మత్స్యకార గ్రామాలలో, వృత్తిలో ఉన్న సమస్యల గూర్చి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కొన్నిటికి పరిష్కారాలు సూచించారు. అలాగే నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాల ప్రొఫెసర్ శ్రీ హరిబాబు చేపల, రొయ్యల సాగు గురించి, వాటిలో వచ్చే సమస్యలు, పరిష్కారాలను గూర్చి వివరించారు.





