సేవా భారతి, విజయవాడ వారు ఫిబ్రవరి 2 న వార్షిక క్రీడా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాలలో గల 35 అభ్యాసికల నుండి 512 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర జూనియర్లు, బాలుర సీనియర్లు, బాలికల జూనియర్లు మరియు బాలికల సీనియర్లు – వివిధ విభాగాలలో రన్నింగ్, నిమ్మ & చెంచా & స్కిప్పింగ్ పోటీలు జరిగాయి. గ్రూప్ సింగింగ్ & క్విజ్ పోటీలు కూడా జరిగాయి. వ్యాయామయోగ్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నది.
కృష్ణ ఇండస్ట్రియల్ & అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ శ్రీ జి.వి.రామారావు గారు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ఫిబ్రవరి 16 ఆదివారం, సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే బాలా మేళాలో ఇవ్వబడతాయని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 16న జరిగే బాలమేళాకు అందరూ ఆహ్వానితులేనని, అందరూ తప్పక పాల్గొనాలని కూడా సేవాభారతి కార్యకర్తలు విన్నవించారు.