News

సంఘ్ నేర్పిన సంస్కారం అనాధకు ఆసరా అయ్యింది

885views

ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవకులు శ్రీ ఈపనగండ్ల శ్రీనివాసులు, శ్రీ పలుకూరి సురేష్, శ్రీ భీష్మాచారి, ఆరునెలలు క్రితం అవసాన దశలో ఉన్న శ్రీమతి లక్ష్మీదేవి అనే అనాద వృద్ధురాలి దీన స్థితిని గమనించారు. ఈ మిత్రులు ఈ వృద్ధురాలికి అన్నీ తామై అన్ని విధాలా ఆదుకున్నారు.

సదరు మహిళ గురువారం తెల్లవారుజామున మృతిచెందడంతో స్థానిక పోలీసులకు సమాచారమందించి, ఎవరూ లేని ఆమెకు అన్నీ తామై, హిందూ ధర్మం ప్రకారం చివరి ప్రయాణం కూడా నిర్వహించి వారి ఔదార్యాన్ని ప్రదర్శించారు.

స్థానికులు ఈ యువకుల నిస్వార్థ సేవను, దీన దుఃఖితుల పట్ల వీరి స్పందించే హృదయాన్ని గూర్చి గొప్పగా చర్చించుకున్నారు‌.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.