
159views
శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, శాస్త్రవేత్తలు సోమవారం దర్శించుకున్నారు. ఈ నెల 24న శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్న ఎల్‌వీఎమ్03-ఎం6 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తామన్నారు. ఈ ఉపగ్రహం నేరుగా కక్ష్య నుంచి డివైజ్‌కు సిగ్నల్ ఇస్తుందన్నారు. వచ్చే ఏడాది నాలుగుకు పైగా ప్రయోగాలు చేయనున్నట్లు చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా మరో రెండు ప్రయోగాత్మక పరీక్షలు జరపనున్నట్లు తెలిపారు. 2027లో గగన్‌యాన్ క్రూ మాడ్యూల్, అంతరిక్ష స్పేస్‌స్టేషన్, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు.





