
భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టిచంపి చెట్టుకు వెలాడదీసి నిప్పంటించారు. అయితే తాజాగా, హాదీ సోదరి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు.ఒక వీడియోలో.. ఆమె ‘భారత్‌తో పోరాటాని’కి లింగ, వయో బేధం లేకుండా, పిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జిహాదీ శిక్షణ ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది.
‘భారత్‌తో పోరాడటానికి లింగ, వయోబేధం లేకుండా సిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జీహాదీ శిక్షణ ఇవ్వాలి’ అని పేర్కొంది. ఇదే సమయంలో భారతీయ స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చుకుంటూ ‘నేను ఖుదీరామ్ బోస్ లేదా ఆజాద్‌లను చూడలేదు.. కానీ, నేను ఉస్మాన్ హాడీని చూశాను.. హాదీ విప్లవ నాయకుడు’ అని వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో భారత్‌పై ఆమె ప్రత్యక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘బంగ్లాదేశీయులమైన మేము భారతీయ కుక్కలను పూర్తిగా తరిమికొట్టే వరకూ వరకూ విశ్రమించం.. ఈ యుద్ధం 200 ఏళ్ల కిందటే మొదలైంది.. అవామీ లీగ్, భారత్ మన దేశంలో ఎన్నికలు జరగకూడదని కోరుకుంటున్నాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.





