News

కేరళలో గూండాల్లాగా చెలరేగిపోయిన కమ్యూనిస్టులు

194views
ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కత్తి దూశారు కమ్యూనిస్టులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోయారు. నిత్యం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటూ వల్లెవేసే కమ్యూనిస్టులు బీజేపీ విజయాన్ని,తమ పరాభవాన్ని జీర్ణించుకోలేక… గుండాల్లాగా వీరంగం సృష్టించారు.
పానూర్ ప్రాంతంలోని పరాడ్ వద్ద సీపీఎం కార్యకర్తలు యూడీఎఫ్ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. అలాగే స్థానికులను బెదిరిస్తూ, పేలుడు పదార్థాలను విసిరి, వాహనాలను ధ్వంసం చేశారు. పరాడ్ పట్టణంలో జరిగిన విజయోత్సవ వేడుకల సందర్భంగా యూడీఎఫ్, సీపీఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్ల దాడి కూడా జరిగింది. అయితే యూడీఎఫ్ కార్యకర్తలే తమపై దాడికి దిగారని కమ్యూనిస్టులు అంటున్నారు.
ఇక.. సీపీఎం కార్యకర్తలు సంఘటితమై ఆయుధాలతో వచ్చారు. రావడం రావడమే కత్తులతో ప్రజల వైపు దూసుకెళ్లిపోయారు. అయితే.. ముఖాలకు బట్టలు చుట్టుకొని వచ్చి మరీ.. సీపీఎం నేతలు దాడులకు దిగారు.స్థానికుల ఇళ్లల్లోని పూల కుండీలను కూడా ధ్వంసం చేసి, బెదిరింపులకు దిగారు. పరాడ్‌లోని అచంటవిడ అష్రఫ్ ఇంటిపై పేలుడు పదార్థాలు విసిరారు. అతని ప్రాంగణంలో పార్క్ చేసిన కారు మరియు స్కూటర్ ధ్వంసమయ్యాయి. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ.. మహిళలను కూడా బెదిరించారు.
ఇక.. సీపీఎం నేతలు చేసిన రాళ్ల దాడిలో చాలా మంది కార్మికులు కూడా గాయపడ్డారు. కొన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు కూడా వున్నాయి.
కొల్లాం జిల్లా కడక్కల్ లో కూడా…
ఇక.. కొల్లా జిల్లాలోని కడక్కల్ లో విజయం సాధించిన అనుపమ అనే మహిళా అభ్యర్థిపై సీపీఎం గూండాలు దాడి చేశారు. భౌతికంగా దాడి చేయడమే కాకుండా, బయటికి వస్తే చంపేస్తామని కూడా బెదిరించారు.ఇదే కొల్లాలోని నెయ్యంట్టింకరలోని బీజేపీ కార్యకర్తలపై సీపీఎం గూండాలు దాడి చేశారు.కొట్టాయం జిల్లాలోని కంజిరప్పిల్లిలో, యుడిఎఫ్ కౌంటింగ్ ఏజెంట్ మరియు ఒక మహిళతో సహా ఇతర కార్మికులపై దాడి జరిగింది.
తిరువనంతపురంలో..
తిరువనంతపురంలోని త్రిక్కన్నపురంలో కూడా సీపీఎం గూండాలు రెచ్చిపోయారు. బీజేపీ ఎన్నికల కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బ్యానర్లు, ఫ్లెక్స్ బోర్డులను చించివేశారు. వాహనాలపై కూడా దాడి చేశారు.
త్రిసూర్ ప్రాంతంలో…
పున్నయూర్కుళంలో కూడా సీపీఎం గూండాలు రెచ్చిపోయారు. రాజకీయాలు గానీ, పార్టీల గురించి గానీ ఏమాత్రం అంటనట్టుగా వుండే ఆడుకునే చిన్నారులపై కూడా సీపీఎం కార్యకర్తలు దాడికి దిగారు.