
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 11వ శతాబ్దంలో ఆనాడు నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల సందర్శించారు. గామాలపాడు గ్రామంలో ఆనాడు నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఇటీవల కాలంలో టీటీడీ బోర్డ్ మెంబెర్ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పునర్ నిర్మిస్తున్న శివాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ముందుగా కలెక్టర్ కృత్తికా శుక్లా కి ఆలయ అర్చకులు,స్థానిక రెవిన్యూ అధికారులు స్వాగతం పలికారు.అనంతరం కలెక్టర్ కృత్తికా శుక్లా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాల వివరాలను అక్కడ ఉన్న అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కి వేద ఆచిర్వచనం అందజేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళి,గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





