News

వందేమాతరానికీ జాతీయగీతం స్థాయి కల్పించాలి

164views

దేశభక్తితో ముడిపడిన వందేమాతరం గేయాన్ని కూడా జాతీయ గీతంతో సమానంగా గుర్తించడానికి దేశం ఒక నిర్ణయం తీసుకోవాలని భాజపా అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా వందేమాతరం ప్రాధాన్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ తగ్గించిందని ఆయన ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలే దానికి కారణమన్నారు. వందేమాతరంపై ప్రత్యేక చర్చ ముగింపు సందర్భంగా రాజ్యసభలో ఆయన 50 నిమిషాలు మాట్లాడారు. ‘‘వందేమాతరం అంటే దేశాన్ని ఐక్యంగా ఉంచే మంత్రం. అది బ్రిటిష్‌వారిని భయపెట్టింది. దేశ చరిత్ర రికార్డును సరిచేయడమే తప్పిస్తే తొలి ప్రధాని నెహ్రూను కించపరచడం ఈ చర్చ ఉద్దేశం కాదు. ఒక పరిణామం జరిగినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు దానికి బాధ్యత వహించాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌ది ఎప్పుడూ అవకాశవాదం. ప్రారంభం నుంచి కూడా దేశ సంస్కృతి, విలువలు, ఆలోచనల్లో ఆ పార్టీ రాజీపడుతూ వస్తోంది. మాకు మాత్రం దేశమే ప్రధానం. వందేమాతరాన్ని ఆలపించకపోయినా, అగౌరవపరిచినా చర్య తీసుకునే నిబంధన సంబంధిత చట్టంలో లేదు’’ అని చెప్పారు.