News

పాక్ ఔషదాలను నిషేధించిన తాలిబాన్ సర్కార్

182views

ఆఫ్గనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలు నాణ్యత లేకుండా పోతున్నాయని, ప్రజా ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదమని పేర్కొంది. ఈ విషయాన్ని తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘని బరదార్ ప్రకటించారు.కొత్త సరఫరాదారులను, పాక్ తో వున్న లావాదేవీలను పరిష్కరించుకోవడానికి తాలిబాన్ సర్కార్ మూడు నెలల సమయం తీసుకుంది.

మరో వైపు తాలిబాన్ సాంస్కృతిక సలహాదారు సయీద్ ఖోస్తీ ఓ అడుగు ముందుకేసి.. పాక్ నుంచి వచ్చే మందులన్నీ విషం లాంటివే అని అభివర్ణించేశారు. అసలు అవి మార్కెట్ లో అమ్మడానికి ఏమాత్రం అర్హత లేవని మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా పాకిస్తానీ జనరిక్ ఔషధాలు మరింత చౌకగా వున్నాయని, ఏమాత్రం నాణ్యత లేవని అంటున్నారు.

ఇక.. తాలిబన్లు పాకిస్తాన్ నుండి వచ్చే దాదాపు అన్ని మందులను నిషేధించారు. అయితే మార్కెట్ లో కొరతగా వున్న యాంటీబయాటిక్స్, ఇన్సులిన్, రోజువారీ వ్యాధులకు ఉపయోగించే ఔషదాల విషయంలో కూడా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేశారు. వీలైనంత తొందర్లోనే వీటిపై కూడా పూర్తి నిషేధాన్ని విధించనున్నారు.

అమోక్సిసిలిన్, ఇన్సులిన్ ఇంజెక్షన్లు మరియు రక్తపోటు లేదా గుండెపోటుకు ఉపయోగించే మందులు వంటి సాధారణ యాంటీబయాటిక్స్‌తో సహా ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని మందులలో 70 శాతానికి పైగా పాకిస్తాన్ నుండి వచ్చాయి.

అఫ్గాన్ నిర్ణయంతో సంక్షోభం…
అఫ్గాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ తీవ్రంగా ఔషదాల కొరత ఏర్పడింది. ముఖ్యంగా కాబూల్ తో పాటు ప్రధాన నగరాల్లోని ఫార్మసీ షాపుల్లో అనేక మందులు అసలు అందుబాటులోనే లేవు.రెండు నెలలకు పైగా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా సరఫరా గొలుసులు ఇప్పటికే దెబ్బతిన్నాయి.ఇప్పుడు నిషేధం యాంటీబయాటిక్స్ మరియు ఇన్సులిన్ వంటి ముఖ్యమైన మందులను మార్కెట్లో అందుబాటులో లేకుండా పోయింది. దీంతో వున్న మందుల ధరలు పెరిగాయి.డయాబెటిస్ లేదా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రోగులు మూలికా మందులపై ఆధారపడుతున్నారు.