News

విశాఖపట్నంలో వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా

117views

ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా ప్రారంభం అయింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల నేతృత్వంలో నిర్వహిస్తున్న మేళాను ఆయన ప్రారంభించారు.

అనంతరం పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం అని కోరారు. నగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చి దిద్దడం మన బాధ్యత అని వివరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని వివరించారు. ఆర్గానిక్ పంటలతోనె ఆరోగ్యం సాధ్యం అని వివరించారు.

రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు మాట్లాడుతూ తమ సంస్థ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం కోసం రైతులతో కలిసి పని చేయడం జరుగుతుంది అని వివరించారు.

ఈ మేళా లో భాగంగా ఏర్పాటు చేసిన థింసా నృత్యం, కట్టె గానుగ, బుద్దుడు, అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా విగ్రహాలు, పుంగనూరు ఆవులు, కుమ్మరి సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన, జివిఎంసి అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, ప్రకృతి రైతులు పిఎల్ఎన్ రాజు, ఎన్ నరేంద్ర, రిషి, మేంగో మేన్ అప్పాజీ తదితర ప్రకృతి రైతులు పాల్గొన్నారు.