News

ప్రపంచ క్షేమాన్ని కోరే హిందూ ధర్మం

132views

భారతదేశం ప్రపంచానికి ఓ పూజగది లాంటిదని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు లలిత్‌కుమార్‌ అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ హిందూసేన ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని తంగేడు కాటా వద్ద హిందూ మహా సమ్మేళనాన్ని నిర్వహించారు. ర్యాలీగా సభావేదికకు చేరుకుని జైశ్రీరామ్‌ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లలిత్‌కుమార్‌ మాట్లాడుతూ హిందూ ధర్మంలో ప్రపంచ క్షేమాన్ని కోరుతూ పూజలు చేస్తారని, అందుకే భారతదేశం ప్రపంచానికి పూజ గది అయ్యిందన్నారు. ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని హిందూ ధర్మం కోరుతోందన్నారు. వేదం ప్రకారం భగవంతుడుని కొలవడానికి బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞాలు మార్గం అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఏర్పడి వందేళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారక్‌ సత్యనారాయణ, సర్పంచులు కొరుప్రోలు శివకుమార్‌, బొడ్డేటి వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ దాసరి వెంకటరావు, శివాజీ హిందూసేన సభ్యులు పాల్గొన్నారు.