News

తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం

130views

కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరగాలని, హిందూ బంధువులంతా సంఘటితం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్‌కె గ్రౌండ్‌లో జరిగిన హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. శ్రీధర స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ నాయకులు భాగయ్య మాట్లాడుతూ హిందూ బంధువులంతా సంఘటితమై హైందవ ధర్మాన్ని పరిరక్షించుకొని భారత్‌ను విశ్వగురువుగా నిలపాలని పిలుపు నిచ్చారు. హిందూ పరిరక్షణకు అందరూ జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వాసవీ పీఠాధిపతి శ్రీధర స్వామీజీ పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు బూరుగపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు. నిర్వాహకులు ముత్తా రామారావు, వేమూరి వెంకటరామం, గట్టిం మాణిక్యాలరావు, సుంకవల్లి రామకృష్ణ, గ్రంధి సత్యనారాయణ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఈతకోట తాతాజీ, వలవల బాబ్జీ పాల్గొన్నారు.