
148views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని నాగపూర్ సంస్కార భారతి ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకుంది. నాగపూర్ లోని వ్యాస్ సభా గృహంలో సంస్కార భారతి ‘‘సంఘ్ దధీచి’’ అన్న పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్, సేవికా సమితికి చెందిన 100 మందికి పైగా ప్రచారకులు, ప్రముఖ సంఘ్ అధికారుల చిత్రాలను రంగోళీ ద్వారా వేశారు. వారి త్యాగం, అంకిత భావం, దేశ భక్తికి పోర్ట్రెయిట్ రంగోళీ ద్వారా, కళాత్మకంగా నివాళి అర్పించారు.నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాల పాటు దేశానికి సేవ చేశారంటూ చిత్రాలను గీసి, నివాళి అర్పించారు.

ఈ పెయింటింగ్ లో మొదట హోమగుండం, అలాగే భగవా ధ్వజం, సంఘ కార్యకర్త శంఖ పూరిస్తూ, ‘‘మాతృభూ కీ అర్చనా మే దీప్ బన్ కర్ జో గలే’’అన్న ధ్యేయవాక్యం రాశారు. అలాగే ‘సంఘ దధీచి’’ అని అందులో రాశారు.
ఆ తర్వాత ఆద్య సరసంఘచాలక్ డాక్టర్జీ, రెండో ద్వితీయ సరసంఘచాలక్ గురూజీ, ఆ తర్వాత దత్తాత్రేయ దేవరస్, రజ్జూభయ్యా, సుదర్శన్ జీ, ఏకనాథ్ రాణడే, అశోక్ సింఘాల్, చమన్ లాల్, రంగాహరి, సూర్యనారాయణ రావు, లక్ష్మణ్ వాసుదేవ్ పరాంజపే, పండిత్ ప్రేమనాథ్ డోగ్రా, సేవికా సమితి మొదటి ప్రముఖ సంఘచాలిక వందనీయ మౌసీజీ కేల్కర్, వందనీయ సరస్వతీ ఆప్టే, అలాగే ప్రస్తుత సరసంఘచాలక్ మోహన్ భాగవత్ చిత్రాలను పెయింటింగ్ వేశారు.




