News

భారత్ నుంచే మానవ జాతి ప్రపంచమంతటికీ విస్తరించిందా?

936views

ప్రపంచంలో మొట్టమొదట మానవ జాతి వికాసం భారతదేశంలోనే జరిగిందా? తాజా పరిశోధనలు అవుననే అంటున్నాయి. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సెపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల సంవత్సరాలు అయిందని, ఆఫ్రికాలో పుట్టి ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాడని పాశ్చాత్య పరిశోధకుల ఉవాచ.

కానీ ఇదంతా తప్పని, సుమారు నాలుగు లక్షల ఏళ్ల క్రితమే ఆధునిక మానవులు భారత్ లో సంచరించారు అనేందుకు తగిన ఆధారాలను భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు.

అలాగే ఇజ్రాయెల్ లో కూడా సుమారు రెండు లక్షల ఏళ్ల క్రితమే మానవజాతి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

భారత్ లో లభించిన పురాతన రాతి పనిముట్లకు, ఆఫ్రికాలో లభించిన వాటికి ఉన్న దగ్గరి పోలికల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెన్నైలోని శర్మ సెంటర్ ఫర్ హెరిటేజ్ ఎడ్యుకేషన్ కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త పప్పు శాంతి తెలిపారు. అయితే చెన్నైకి నైరుతి దిక్కులో లభించిన ఈ పనిముట్లు ఉపయోగించిన మానవులు స్థానికులేనా? లేక ఆఫ్రికా నుంచి వలస వచ్చిన హోమో సెపియన్లా, లేదు భారత్ నుంచే మానవ జాతి ప్రపంచమంతటికీ విస్తరించిందా? అనేది తేలాల్సి ఉంది. పనిముట్ల తోపాటు శిలాజాలు ఏవి లభించకపోవడంతో ఈ విషయంలో స్పష్టత రావడం లేదని వారు వివరించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.