
దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరిగిందని, హిందూ జనాభా 4.5 శాతం తగ్గిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు వల్ల ముస్లిం జనాభా పెరగలేదు. చొరబాటు వల్ల పెరిగిందని స్పష్టం చేశారు. దేశం మత ప్రాతిపదికన విభజించబడిందని.. అయితే.. భారత్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వైపుల నుంచి చొరబాట్లు జరిగాయని, దీని ఫలితంగా జనాభాలో ఇంత మార్పు వచ్చిందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో షా మాట్లాడారు. దేశంలో ఓటు హక్కు మన దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండాలని అమిత్ షా అన్నారు. చొరబాటు, ఎన్నికల కమిషన్ కి చెందిన SIRని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది జాతీయ సమస్య అని ఆయన నొక్కి చెప్పారు. SIR అంశాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుందని హోంమంత్రి అన్నారు. అలాగే చొరబాటుదారుడికి, శరణార్థికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కి చెప్పారు. ఒక శరణార్థి తన మతాన్ని కాపాడుకోవడానికి భారతదేశానికి వస్తాడు.. కానీ.. చొరబాటుదారుడు మతపరమైన హింసను ప్రేరేపించడానికి లేదా ఆర్థిక, ఇతర కారణాల వల్ల చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తాడని తెలిపారు.





