News

సుదర్శనచక్ర ఛాయలో గోరక్షణ

213views

రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించే మహాక్షేత్రంగా పేరొందింది విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామనారాయణం. 15 ఎకరాల విస్తీర్ణంలో కోదండం ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రెండంతస్తుల్లో వివిధ రకాల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో 60 అడుగుల ఎత్తులో ఉండే ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీటన్నింటికి మించి ఇక్కడి గోశాలలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. పశువులకు రక్షణగా రూ.20 లక్షలతో సుదర్శనచక్ర రూపంలో మండపాన్ని నిర్మించారు. మధ్యలో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాత్రివేళలో ఇది మిరుమిట్లుగొల్పుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. సుగ్రీవ గోశాలగా నామకరణం చేసిన దీంట్లో ప్రస్తుతం 11 ఆవులున్నాయి. వీటి పాలతోనే అభిషేకాలు చేస్తారు. ప్రసాదాల తయారీ, అన్నదానంలో ఉపయోగిస్తారు.