News

విధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులపై కేసు @ JNU

1.4kviews

జేఎన్‌యూలోని వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్‌, మరో 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హాస్టల్‌ ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక, సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆపేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. గత శనివారం కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ విభాగానికి వచ్చి అక్కడి సర్వర్‌ రూంను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అడ్మినిస్ట్రేషన్‌ ఫిర్యాదు మేరకు అయిషీ ఘోష్‌, మరో 19 మందిపై జనవరి 5న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.