
కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా అన్య మత ప్రార్థనలు నిర్వహిస్తున్న నలుగురు క్రైస్తవులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణ జిల్లా ఉయ్యూరుకు చెందిన ఎం తిమోతి, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ కు చెందిన ప్రవీణ్, కర్నూలు జిల్లా సున్నిపెంట వాస్తవ్యులైన ఎం జాషువా, ఎం పీటర్ లు శ్రీశైలంలోని రుద్రా పార్కు నందు శుక్రవారం నాడు చేతిలో బైబిల్ ఉంచుకొని అందులోని అంశాలను బిగ్గరగా చదువుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రార్థనా మందిరాలకు సమీపంలో అన్య మత ప్రార్ధనలను నిరోధించే సెక్షన్-3 (ACT 24 /2007) కింద కేసు నమోదు చేసి నంద్యాల కోర్టులో హాజరుపరిచారు. వీరిలో పీటర్ అనే వ్యక్తి 2018లో ఇదే విధమైన కేసులో ముద్దాయి కాగా, ఆ కేసు విచారణలో ఉన్నదని ఆత్మకూరు డి.ఎస్.పి వెంకట్రావు తెలిపారు. సెక్షన్ 3(ACT 24 /2007) ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





