News

మత మార్పిడి ముఠాల బారి నుంచి మమ్మల్ని రక్షించండి – తహశీల్దార్ కు గిరిజనుల వినతి

2.1kviews

తమ గ్రామంలోకి క్రైస్తవ మత ప్రచారకులు ప్రవేశించి గిరిజనులను మత మార్పిడి చేయడానికి యత్నిస్తున్నారని, దానికోసం ఆకర్షణ సభలు ఏర్పాటు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని కొండ లోగాం పంచాయితీ తెంతులిగాం గ్రామ గిరిజనులు మందస తహశీల్దార్ పివి శ్యామసుందర్ రావుకు వినతి పత్రం అందజేశారు.

క్రైస్తవ మతంలో చేరకపోతే అంతు చూస్తామని గ్రామస్తులను వారంతా బెదిరిస్తున్నారని వారు తెలిపారు. తామంతా హిందువులమేనని, తమను క్రైస్తవ మత మార్పిడి ముఠాల బారి నుంచి రక్షించాలని ఆ గ్రామస్థులు తహశీల్దార్ ని కోరారు.

సవర ప్రకాష్, సవర శేఖర్, సవర రమేష్, సవర రంగయ్య, సవర బాలకృష్ణ, సవర కామేశ్వరరావు, సవర ధర్మ, సవర దాలయ్య వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.