News

కాకినాడ మిలాద్ – ఉన్ – నబీ ర్యాలీలో పాలస్తీనా జెండాలు

184views

రాష్ట్రంలోని కాకినాడలో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా వివాదం రేగింది. ఊరేగింపులో పాల్గొన్న వారు పాలస్తీనా జెండాలను ఊరేగింపులో ఎగరేశారు. దీంతో జాతీయవాదులు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో జగన్నాథపురం నుంచి ప్రారంభమై భానుగుడి సర్కిల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు భానుగడి జంక్షన్ లో పాలస్తీనా జెండాలను ఊరేగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ప్రయోజనాలకే అవమానకరమని మండిపడుతున్నారు.అయితే కేవలం పాలస్తీనా జెండాలే కాకుండా వివిధ రకాల చిహ్నాలున్న ఇస్లామిక్ బ్యానర్లను కూడా రెపరెపలాడించారు.