News

ఆధ్యాత్మిక ‘పరిమళాలు’

126views

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి అలంకరించే, ఆర్జిత సేవలకు వినియోగించే పూలను, తులసితో అగరుబత్తీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కొనసాగిస్తున్నారు.నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు అలంకరించే, ఆర్జితసేవల్లో వినియోగించే పూలను, బిల్వపత్రాలను ఒకప్పుడు వ్యర్థంగా పడేసేవారు. ప్రస్తుతం వీటిని అగర్‌బత్తీలుగా మార్చడంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. స్వామివారి నిత్యకైంకర్యానికి వినియోగించిన పూలు అగర్‌బత్తీలుగా.. గోశాల నుంచి వచ్చే వ్యర్థాలను ఆవుపేడ, గో పంచకం దూప్‌స్టిక్స్‌గా భక్తులను పరవశింపజేస్తున్నాయి.